March 24, 2026

మతం మారితే.. ‘No SC Status’ : Supreme Court

Indian supreme court

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో చర్చి నిర్వహణపై తలెత్తిన వివాదం నేపథ్యంలో వెలువడిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మతం మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes) హోదా మరియు ఆ కులానికి వర్తించే చట్టపరమైన రక్షణలు వర్తించవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) సమర్థించింది. మతం మారిన తర్వాత కూడా ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నప్పటికీ, అట్రాసిటీ చట్టం (SC/ST Atrocities Act) కింద కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

బాపట్ల జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చర్చి నిర్వహిస్తున్నారని అక్కల రామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆనంద్ తనపై కుల వివక్ష చూపారని పేర్కొంటూ రామిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించి పాస్టర్‌గా మారారని, మతం మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

Read this article also: “ఎన్‌కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌తోనే సమాధానం చెబుతాం”: మీరట్‌లో AIMIM నేత షౌకత్ అలీ

ఇరువురి వాదనలు విన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ రాజ్యాంగ నిబంధనలను ఉటంకిస్తూ కీలక తీర్పునిచ్చారు. షెడ్యూలు కులాల రాజ్యాంగ ఉత్తర్వు 1950లోని 3వ నిబంధన ప్రకారం, హిందువు కాని వ్యక్తి ఎస్సీ కులానికి చెందినవాడు కాలేడని పేర్కొన్నారు. పుట్టుకతో హిందువు అయినప్పటికీ, క్రైస్తవ లేదా మహమ్మదీయ మతాల్లోకి మారితే వారు ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎందుకంటే ఆ మతాల్లో కుల ప్రస్తావన ఉండదని కోర్టు వివరించింది.

ఆనంద్ మతం మారినందున ఆయనకు అట్రాసిటీ చట్టం కింద రక్షణ పొందే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పి రామిరెడ్డిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు నిర్ణయం సరైనదేనని సమర్థించింది. మతం మారిన ఎస్సీ వ్యక్తికి పాత హోదా వర్తించదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది.

English Summary

The Supreme Court has upheld a landmark judgment by the Andhra Pradesh High Court, stating that an individual loses their Scheduled Caste (SC) status and the protections of the SC/ST Atrocities Act upon converting to Christianity. This ruling stems from a dispute in Bapatla district where Chintada Anand filed an atrocity case against Akkala Ramireddy over a church construction issue.

The court observed that according to the Constitution (Scheduled Castes) Order 1950, a person who is not a Hindu cannot be considered a member of a Scheduled Caste. Justice Harinath noted that since Anand had embraced Christianity and was practicing as a pastor, he could no longer claim SC status for legal protections. The Supreme Court affirmed this decision, marking a significant precedent regarding religious conversion and caste-based legal safeguards.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *