- కేంద్రానికి విన్నవించిన చంద్రాబాబు
రక్షణ రంగంలో భారతదేశం నూతన శకానికి అంకురార్పణ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశపు అగ్రగామి రహస్య యుద్ధ విమాన తయారీ కేంద్రాన్ని ఆంధ్రాలో స్థాపించేందుకు నాయుడు కసరత్తు చేస్తున్నారు. దేశాభివృద్ధికి కీలకంగా మారబోయే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్ల తయారీ మరియు పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందిస్తున్న ఐదవ తరగతి రహస్య యుద్ధ విమానాల తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డ్రోన్ల హబ్, భారత వైమానిక దళం (IAF) స్టేషన్ ఏర్పాటుకూ ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్ కోసం లేపాక్షి–మడకసిర హబ్ ప్రాంతంలో 10,000 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని ఎకనామిక్ ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇది బెంగళూరు విమానాశ్రయానికి గంట దూరంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారిందని చెప్పొచ్చు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడుల తర్వాత దేశంలో మూడవ రక్షణ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలని నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ విస్తరించనుంది.
HAL తయారు చేస్తున్న ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానం ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతోందని పేర్కొంది.
డ్రోన్ల తయారీ, రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలకు తోడు, డోనకొండలో IAF స్టేషన్, నావికోపకరణాల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నాయుడు విజ్ఞప్తి చేశారు.
మే 23న నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం దెబ్బతినిందని, ఇప్పుడు ఆ నష్టాన్ని తొలగించేందుకు తమ ప్రభుత్వం శరవేగంగా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటపట్టించడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన నాయుడు – అమిత్ షా, రాజనాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌లతో పాటు, ప్రహ్లాద్ జోషి (పునరుత్పత్తి శక్తి), అశ్వినీ వైష్ణవ్ (ఇలక్ట్రానిక్స్, ఐటీ), సి. ఆర్. పాటిల్ (జల శక్తి), జితేంద్ర సింగ్ (విజ్ఞాన, సాంకేతిక శాఖ) లను కలిసినట్లు వెల్లడించారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.