March 31, 2026

దళపతి విజయ్ ఆస్తుల లెక్కలివే!

VIJAY

VIJAY

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సూపర్ స్టార్ విజయ్ తన నామినేషన్ దాఖలు చేశారు. తన రాజకీయ పార్టీ ‘టీవీకే’ (TVK) తరపున పోటీ చేస్తున్న ఆయన, అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ సంపాదన మరియు ఆస్తుల విలువ చూసి అభిమానులు, నెటిజన్లు అశ్చర్యపోతున్నారు.

సినీ దిగ్గజాలు ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్ మరియు ట్రిచి సిటీ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. తన కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ‘న్యూ ఏజ్ పాలిటిక్స్’కు తెరలేపిన విజయ్, భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు.

ఓటర్ల హైజాకింగ్‌పై మమత ఫైర్ ఈ వార్తను కూడా చదవండి

విజయ్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 515 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తులు (Movable Assets) రూ. 400 కోట్లు కాగా, స్థిరాస్తులు (Immovable Assets) రూ. 115 కోట్లుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆయన ఆదాయం భారీగా పెరిగింది. ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 237 కోట్ల ఆదాయాన్ని గడించడం విశేషం.

ప్రస్తుతం తమిళనాట రజనీకాంత్‌ను మించిన క్రేజ్ ఉన్న హీరోగా విజయ్ గుర్తింపు పొందారు. ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న ఆయన, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే లాభాలు, ఓటీటీ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

#ThalapathyVijay #TVK #TamilNaduElections #VijayAssets #Politics #BreakingNews #VijayNomination #Kollywood

ఓటర్ల హైజాకింగ్‌పై మమత ఫైర్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *