Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట 8 మంది మృతి
Bihar Stampede బీహార్ రాష్ట్రంలో ఓ ఆలయంలో మంగళవారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తురాళ్లు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని విస్తుగొలిపే ఈ సంఘన నలందా జిల్లాలో బిహార్‌శరీఫ్ సమీపంలోని మఘడా గ్రామంలో జరిగింది. వివరాలి ఉన్నాయి.
బిహార్‌లోని నలందా జిల్లాలో బిహార్‌శరీఫ్ సమీపంలోని మఘడా గ్రామంలో ఉన్న మాతా శీతలాష్టమీ ఆలయంలో ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీ ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్థలం తక్కువ. భారీగా చేరుకున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. అదుపు తప్పి ఒకరిపై ఒకరు పడిపోయారు. వీరిలో కింద పడిన 8 మంది మహిళలు మృతి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని మోడల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిర్వాహకులు చర్యలు తీసుకుని ఆలయం, మేళాను తాత్కాలికంగా మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఆసుపత్రితోపాటు, ఆలయ ప్రాంగణం బంధువుల రోదనలతో మార్మోగుతోంది.
చనిపోయిన వారిలో ఇద్దరిని గుర్తించారు. సకుంట్ బిహార్‌కు చెందిన దినేశ్ రజక్ భార్య రీతా దేవి (50), నూర్సరాయ్ మథురాపూర్‌కు చెందిన కమలేష్ ప్రసాద్ భార్య రేఖా దేవి (45)గా అధికారులు తెలిపారు. మిగిలిన మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.
రేఖా దేవి కుమారుడు మాట్లాడుతూ, తన తల్లి మేళా చూడటానికి వెళ్లిందని తెలిపాడు. వేలాది మంది గుమిగూడారని, విషయం తెలుసుకుని తాము అక్కడికి చేరుకుని తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందిందని చెప్పారు.
మఘడా గ్రామంలోని ఈ ఆలయం బిహార్‌శరీఫ్‌కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శీతల అష్టమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆచారం ప్రకారం ఈ రోజు ఇళ్లలో వంట చేయరు. ఒక రోజు ముందుగా సిద్ధం చేసిన చల్లని భోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.
భద్రతా ఏర్పాట్లపూ విమర్శలు
పెద్ద ఎత్తున జనం ఆలయానికి వస్తారని తెలిసి కూడా భద్రతా ఏర్పాట్లు సరిగ్గా చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జన నియంత్రణ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నలందా విశ్వవిద్యాలయం పట్టాభిషేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనడం నేపథ్యంలో జిల్లా పోలీసు బలగాల్లో ఎక్కువ భాగం అక్కడే మోహరించినట్లు సమాచారం.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలు ఏమిటో విచారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
బీహార్‌లో ఘోర ప్రమాదం: ఆలయంలో తొక్కిసలాట 8 మంది మృతి | Bihar Stampede
బీహార్‌లోని నలందా జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. మఘడా గ్రామంలోని శీతలాష్టమీ ఆలయంలో మంగళవారం జరిగిన Bihar Stampede ఘటనలో ఎనిమిది మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో భక్తులు భారీగా తరలిరావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
రద్దీ పెరగడంతో అదుపుతప్పిన పరిస్థితి
బిహార్‌శరీఫ్ సమీపంలోని మాతా శీతలాష్టమీ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రాంగణం చిన్నది కావడం, సామర్థ్యానికి మించి భక్తులు పోటెత్తడంతో ఒక్కసారిగా Stampede at Nalanda Temple సంభవించింది. భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడక ఎనిమిది మంది మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
భద్రతా వైఫల్యంపై స్థానికుల ఆగ్రహం
ప్రతి ఏటా ఈ ఉత్సవాలకు వేలాది మంది వస్తారని తెలిసినా, పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం పోలీసు బలగాలను వేరే ప్రాంతానికి తరలించడం వల్లే ఇక్కడ Security Failure జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ప్రస్తుతం గాయపడిన ఆరుగురు భక్తులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Bihar Stampede
A devastating stampede occurred on Tuesday at the Mata Sheetla Ashtami temple in Maghada village, Nalanda district, Bihar. The incident claimed the lives of eight female devotees and left several others injured during the crowded Chaitra month celebrations.
The lack of proper crowd management and the narrow temple premises are cited as the primary reasons for the chaos. Local authorities have launched an investigation into the security lapses, while the temple has been temporarily closed to control the situation.

