March 31, 2026

Srivari Darshan Details : దర్శనానికి 12 గంటల సమయం

Srivari Darshan Details

తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడుతోంది. సోమవారం (మార్చి 30, 2026) నాటి రద్దీ వివరాలను టీటీడీ అధికారికంగా వెల్లడించింది. వేసవి సెలవులకు ముందే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.

మార్చి 30వ తేదీన మొత్తం 70,044 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులలో 27,241 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 5.08 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉన్నప్పటికీ, సర్వదర్శనం (SSD టోకెన్లు లేని వారు) కోసం భక్తులు 20 కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. వీరికి స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 8 నుండి 12 గంటల సమయం పడుతోంది.

English Summary

Tirumala is witnessing a significant influx of pilgrims as the month of March comes to a close. On March 30, 2026, a total of 70,044 devotees visited the hill shrine to seek the blessings of Lord Venkateswara. The temple authorities reported a substantial Hundi collection of ₹5.08 crore, reflecting the immense devotion of the visiting pilgrims.

Regarding the darshan timelines, there are currently 20 compartments filled with devotees waiting for Sarvadarshanam. Pilgrims without SSD tokens are experiencing a waiting period of approximately 8 to 12 hours. Additionally, 27,241 devotees fulfilled their vows by performing the traditional tonsure ceremony (offering hair) at the Kalyanakatta.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *