March 29, 2026

DMK Candidate List 2026 : 164 స్థానాల్లోనే డీఎంకే పోటీ

Dmk list

అభ్యర్థులను ప్రకటించిన సీఎం స్టాలిన్

తమిళనాడు శాసనసభకు జరగనున్న ఎన్నికలలో డిఎంకే కొంత పట్టువిడపులకు వెళ్ళుతున్నట్లు తెలుస్తోంది. చాలా స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉన్నా, మిత్ర పక్షాలకు సముచిత స్థానం కల్పించే దిశగా అడుగు వేసింది. కేవలం 164 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

శనివారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయంలో 164 మందితో DMK Candidate List 2026ను వెల్లడించారు. పలువురు సీనియర్ నాయకులతో కలసి నేరుగా స్థానిక మెరీనాలో ఉన్న తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి సమాధి వద్దకు వెళ్లి, నివాళులర్పించిన తరువాత తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు స్థానాలను ప్రకటించారు. డిఎంకే కూటమిలోని పార్టీల సంఖ్య 16. వారందరిని ఒక తాటి మీదకు తీసుకువచ్చి తమ కూటమిలో సీట్ల కేటాయింపు పూర్తి చేశారు.

శనివారం ఆయా పార్టీలకు స్థానాలు కూడా ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి 26 స్థానాలు, వామపక్షాలకు చెరి ఐదు స్థానాలను, డిఎండికేకు 10 స్థానాలను కేటాయించారు. మిగిలిన వారికి వారి వారి స్థాయిని అనుసరించి సీట్లను కేటాయించారు. తరువాత తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇదిలా వుండగా గతంలో మూడుసార్లు విజయం సాధించిన కొళత్తూరు నియోజక వర్గం నుంచే స్టాలిన్ మళ్లీ పోటీ చేయనున్నారు. చెపాక్ నియోజ కవర్గం నుంచి ఆయన కుమారుడు, ఉపము ఖ్యమంత్రి ఉదయనిధి మళ్లీ బరిలోకి దిగను న్నారు.

దివంగత సినీనటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత డీఎండీకే అభ్యర్థిగా విరుదాచలం నియోజకవర్గం నుంచి ప్రేమలత, విరుదునగర్ నుంచి ఆమె కుమారుడు విజయ ప్రభాకర్ పోటీ చేయనున్నట్టు డీఎండీకే ప్రకటించింది. ఏఐఏడిఎంకే నుంచి డిఎంకేలో చేరిన పన్నీర్ సెల్వంకు తన సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సీటు కేటాయించారు.

English Summary

DMK Candidate List 2026 : DMK President and Tamil Nadu CM MK Stalin has officially released the candidate list for the upcoming assembly elections. Demonstrating a collaborative approach with allies, the DMK has decided to contest in 164 seats, allocating the rest to its 16 coalition partners.

The list includes high-profile names, with MK Stalin contesting again from Kolathur and Udhayanidhi Stalin from Chepauk. Notable allocations include 26 seats for Congress and 10 for DMDK, setting the stage for a high-stakes electoral battle in Tamil Nadu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *