March 29, 2026

VARUNTEJ: ‘బరి’ సిద్ధం!

SANKRANTHI 'BARILO'

SANKRANTHI 'BARILO'

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న నూతన చిత్రం ‘బరి’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సొంత చెల్లెలు నిహారిక నిర్మాణంలో తాను హీరోగా నటించడం చాలా స్పెషల్‌గా ఉందని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. గతంలో తన తండ్రి నాగబాబు తన సోదరులతో కలిసి సినిమాలు నిర్మించిన తీరును గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు తాము కూడా అదే బాటలో పయనించడం గర్వంగా ఉందని నిహారిక తెలిపారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి వచ్చే సినిమా అంటే ప్రేక్షకులు కచ్చితంగా నమ్మకంతో థియేటర్‌కు వచ్చేలా క్వాలిటీతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

రామ్ చరణ్ ‘పెద్ది’ పవర్‌ఫుల్ గ్లింప్స్ ఈ వార్తను కూడా చదవండి

దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని వాలీబాల్ ఆట నేపథ్యంలో ఒక బలమైన కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. గతంలో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ మ్యూజిక్ కంటే పది రెట్లు అద్భుతంగా ఈ చిత్రంలోని సంగీతం ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ వాతావరణం, క్రీడా స్ఫూర్తి కలగలిసిన ఈ కథ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు వరుణ్ తేజ్ అధికారికంగా ప్రకటించారు. పండగ సీజన్‌లో ‘బరి’ సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి వంటి ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మరియు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మన్యం ఆధ్వర్యంలో ఈ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.

Bari #VarunTej #NiharikaKonidela #PawanKalyan #PinkElephantPictures #Tollywood #SportsDrama #SankrantiRelease #MegaFamily

రామ్ చరణ్ ‘పెద్ది’ పవర్‌ఫుల్ గ్లింప్స్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *