March 28, 2026

స్వచ్ఛాంధ్రకు విద్యార్థులే వారధులు!

TIRUPATI COMMISSIONER SWATCH ANDHRA RALLY

TIRUPATI COMMISSIONER SWATCH ANDHRA RALLY

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. ఎస్వీయూ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ‘జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్’ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా క్యాంపస్ పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు మొక్కలు నాటి స్వచ్ఛత సందేశాన్ని చాటారు.

జనవరి 2025 నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడవ శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. విద్యాసంస్థల్లోని విద్యార్థులలో మార్పు వస్తే సమాజంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. గత ఏడేళ్లుగా నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ఇంకా అక్కడక్కడా వినియోగం జరుగుతోందని, దీనిని అరికట్టడంలో విద్యార్థులు చొరవ చూపాలని కోరారు.

AP ASSEMBLY: శాశ్వత రాజధానిగా “అమరావతి”.. చారిత్రాత్మక తీర్మానం ఈ వార్తను కూడా చదవండి

చెత్తను మూలంలోనే వేరు చేయడంపై కమిషనర్ ప్రత్యేకంగా వివరించారు. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) ఇలా నాలుగు రకాలుగా విడదీయాలని సూచించారు. ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హోమ్ కంపోస్టింగ్ ద్వారా ఎరువుగా మార్చుకుని మొక్కలకు వినియోగించాలని, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయించాలని సూచించారు. జీరో వేస్ట్ లక్ష్యంతో ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద, విద్యాసంస్థల్లో అవగాహన కల్పించాలని కోరారు.

పర్యావరణ హితం కోసం ఎనర్జీ ఎఫిషియన్సీ పద్ధతులను పాటించాలని కమిషనర్ సూచించారు. సాధారణ లైట్ల స్థానంలో ఎల్.ఈ.డి (LED) బల్బులను వాడటం, సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ ప్లే ప్రదర్శించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్ మరియు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

SwachhaAndhra #SwarnaAndhra #ZeroWaste #WasteManagement #EcoFriendly #StudentPower #Tirupati #CleanIndia #PlasticFree

AP ASSEMBLY: శాశ్వత రాజధానిగా “అమరావతి”.. చారిత్రాత్మక తీర్మానం ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *