March 28, 2026

రామ్ చరణ్ ‘పెద్ది’ పవర్‌ఫుల్ గ్లింప్స్

PEDDI RAMCHARAN

PEDDI RAMCHARAN

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మరియు శ్రీరామనవమిని పురస్కరించుకుని, ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ నుండి మేకర్స్ అదిరిపోయే కానుకను అందించారు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ చరణ్ ఊరమాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా కరుడుగట్టిన పహిల్వాన్‌గా కనిపించారు. సిక్స్‌ ప్యాక్ అబ్స్, దృఢమైన కండరాలతో అసలైన కుస్తీ యోధుడిలా ఆయన ఒదిగిపోయారు. ఇటుక గోడలు ఎక్కుతూ, ఇసుక సంచులను మోస్తూ కఠినమైన శిక్షణ తీసుకుంటున్న విజువల్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్ గద పట్టుకుని హనుమంతుడిలా కనిపించిన సీన్ శ్రీరామనవమి వేళ అభిమానులకు కనువిందు చేస్తోంది.

100% వినోదమే లక్ష్యం! ఈ వార్తను కూడా చదవండి

“కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట” అనే డైలాగ్‌తో మొదలైన గ్లింప్స్, చివరలో చరణ్ చెప్పిన “చూడుమే… ఆటే నా పొగరు…” అనే పవర్‌ఫుల్ వాయిస్‌తో ముగిసింది. బుచ్చి బాబు సానా మార్క్ టేకింగ్ మరియు రామ్ చరణ్ ఇంటెన్స్ ప్రజెన్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Ram Charan #Peddi #BuchiBabuSana #MegaPowerStar #PeddiGlimpse #Tollywood #ActionDrama

100% వినోదమే లక్ష్యం! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *