March 27, 2026

Ranjana Nachiyar TVK Controversy టీవీకే వర్చువల్ వారియర్స్ నన్ను టార్గెట్ చేస్తున్నారు.

Ranjana Nachiyar

Ranjana Nachiyar TVK Controversy : చెన్నై వేదికగా తమిళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని వీడి, ఇటీవల డీఎంకేలో చేరిన Actress Ranjana Nachiyar తనపై జరుగుతున్న సైబర్ దాడులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, టీవీకే కార్యకర్తలు తన క్యారెక్టర్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు.

టీవీకే పార్టీకి చెందిన “వర్చువల్ వారియర్స్” తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని Actress Ranjana Nachiyar పేర్కొన్నారు. పార్టీ వీడినందుకు తనపై అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్నారన్నారు. అయినా, ఒక మహిళపై ఇలాంటి దాడులు జరుగుతున్నా విజయ్ స్పందించకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. తన కార్యకర్తలను నియంత్రించడంలో విజయ్ పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వార్త కూడా చదవండి: Assam Assembly Elections 2026: కమలం వికసిస్తుందా?

ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు రంజనా ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డీఎంకేలో చేరిన తర్వాతే ఈ వేధింపులు ఎక్కువయ్యాయని, ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రేనని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్ మరియు తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Ranjana Nachiyar TVK Controversy

Actress Ranjana Nachiyar, who recently defected from Vijay’s Tamilaga Vettri Kazhagam (TVK) to join the DMK, has alleged severe cyber bullying by TVK’s “virtual warriors.” She claimed that these party cadres are engaging in character assassination and using abusive language against her in various social media videos.

Ranjana lodged a formal police complaint on Friday, criticizing TVK leader Vijay for not condemning or restraining his followers. She expressed disappointment over the lack of party discipline and stated that leaving a party should not result in such targeted personal harassment and online abuse.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *