March 27, 2026

Summer: చెమరకాయలకు చెక్!

HEAT RASHES

HEAT RASHES

వేసవి కాలం రాగానే భానుడి ప్రతాపంతో పాటు చెమటకాయల సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. ఇవి చర్మంపై దురదను కలిగించడమే కాకుండా, చర్మపు మృదుత్వాన్ని దెబ్బతీసి తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తాయి. అయితే, వంటింట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. నిరంతరం వేధించే ఈ చర్మ సమస్యలకు ఇంటి చిట్కాలే అద్భుతమైన పరిష్కారాలని నిపుణులు సూచిస్తున్నారు.

చెమటకాయలు ఉన్న చోట చల్లని పెరుగును రాసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే గంధానికి చల్లని పాలు కలిపి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మానికి చల్లదనం లభించి, చెమటకాయలు త్వరగా మాయమవుతాయి.

స్విమ్స్‌లో పేద యువతికి పునర్జన్మ ఈ వార్తను కూడా చదవండి

కలబంద (అలోవెరా) గుజ్జులో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చెమటకాయలను తగ్గించడంలో మొనగాడులా పనిచేస్తాయి. ఇది చర్మంపై ఉండే ఇన్ఫెక్షన్లను తొలగించి, ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది. చెమటకాయలు ఉన్న ప్రదేశంలో నేరుగా కలబంద గుజ్జును రాస్తే చర్మం మళ్ళీ మృదువుగా మారుతుంది.

టిష్యూ పేపర్‌ను వెనిగర్‌లో ముంచి ప్రభావిత ప్రాంతంలో అద్దడం వల్ల చెమటకాయల తీవ్రత తగ్గుతుంది. అదేవిధంగా, లవంగ నూనెను దూదితో చెమటకాయలపై రాస్తూ ఉంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే వేసవి తాపాన్ని, చర్మ సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.

#SummerHealth #SkinCare #HeatRash #NaturalRemedies #SummerTips #HealthySkin #TeluguHealth

స్విమ్స్‌లో పేద యువతికి పునర్జన్మ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *