Iran attack on USS Abraham Lincoln: వెనక్కి తగ్గిన అమెరికా
అమెరికా ఒక వైపు శాంతి ఒప్పందం అంటుంటే, ఇరాన్ మాత్రం రణమే అంటోంది. తాజాగా ఏకంగా అమెరికా వార్ షిప్ అబ్రహ్మం లింకన్ పైకే గురిపెట్టి తన ఉద్దేశ్యం ఏంటో తేల్చి చెప్పింది. దీంతో Chabahar సమీపంలో ఉద్రిక్తత పెరిగింది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS Abraham Lincoln లక్ష్యంగా ఇరాన్ తీరప్రాంతం నుండి క్రూయిజ్ క్షిపణులను (Cruise Missiles) ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ దాడితో అమెరికా నౌక తన స్థావరాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని సమాచారం.
Read this article also: Iran Rejects US Ceasefire Plan: 15-point proposal తిరస్కారం, కొత్త షరతులు ప్రకటింపు
నౌకను వెంటాడుతున్న క్షిపణులు
ఇరాన్ నౌకాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ తెలిపిన వివరాల ప్రకారం, USS Abraham Lincoln కదలికలను ఇరాన్ నిరంతరం నిఘా ఉంచుతోంది. ఈ క్రమంలో చబహార్ (Chabahar) తీరానికి సుమారు 250–300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపైకి ‘ఖాదర్’ (Qader) వంటి శక్తివంతమైన తీర-సముద్ర క్షిపణులను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల ధాటికి అమెరికా నౌక తన దిశను మార్చుకుని ఆగ్నేయ హిందూ మహాసముద్రం వైపు వెనక్కి వెళ్ళినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.
అమెరికా వాదన మరోలా..
అయితే, ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఖండించింది. USS అబ్రహం లింకన్ తన కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తోందని, ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు జరుపుతూనే ఉందని స్పష్టం చేసింది. ఇరాన్ కేవలం తన సైన్యం నైతిక స్థైర్యాన్ని పెంచుకోవడానికే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తోందని అమెరికా అధికారులు కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది.
English Summary
Iran Claims Missile Strike on USS Abraham Lincoln Near Chabahar
The Iranian military has claimed that it launched several coastal cruise missiles at the USS Abraham Lincoln aircraft carrier operating approximately 250–300 km off the coast of Chabahar. According to Iranian state media, the strikes forced the U.S. warship to retreat and change its position. Rear Admiral Shahram Irani stated that the vessel is under constant surveillance and will be targeted again if it enters the range of Iran’s missile systems.
However, U.S. CENTCOM has dismissed these claims as propaganda, asserting that the carrier continues its flight operations against military targets in Iran. While Tehran highlights its “strategic victory” in pushing back the carrier, Washington maintains that its naval assets remain fully operational in regional waters. The escalating naval confrontation comes amid ongoing air strikes by U.S. and Israeli forces as part of Operation Epic Fury.

