టెల్ అవీవ్,గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు: After Trump announcement on War
చర్చలంటున్న ట్రంప్,
దాడులు కొనసాగిస్తామంటున్న ఇజ్రాయెల్
మధ్య Tel Aviv నగరంలోని ఒక వీధిపై మంగళవారం ఇరాన్ క్షిపణి దాడి చేసింది. భారీ శబ్దంతో జరిగిన ఈ దాడి సమీప అపార్ట్‌మెంట్ భవనాల కిటికీలు పగిలేలా చేశాయి, ప్రాంతమంతా పొగతో కమ్మేసింది. నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటన ఇరాన్ దాడులు ఇజ్రాయెల్‌కే పరిమితం కావడం లేదని స్పష్టంచేసింది.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ రాజధాని Beirut దక్షిణ ఉపనగరాలపై దాడులు జరిపాయి. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మౌలిక వసతులనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకారం నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల్లో పలువురు మృతి చెందగా, చిన్నారులు సహా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మళ్లీ ప్రారంభమైనప్పటి నుంచి లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇరాన్ దాడులు గల్ఫ్ ప్రాంతానికి విస్తరించాయి. బహ్రెయిన్‌లో మిసైల్ అలర్ట్ సైరన్లు మోగగా, కువైట్‌లో ఎయిర్ డిఫెన్స్ శకలాలు పడడంతో విద్యుత్ సరఫరా కొంతసేపు నిలిచిపోయింది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్న 19 డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. దీంతో యుద్ధం ప్రాంతీయ స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
యుద్ధ విరమణపై ట్రంప్ ప్రకటన
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు Donald Trump ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. కీలకమైన Strait of Hormuz మార్గాన్ని షిప్పింగ్‌కు తెరవాలని ఇరాన్‌కు ఇచ్చిన గడువును ఆయన పొడిగించారు. లేకపోతే ఇరాన్ పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో చమురు ధరలు కాసేపు తగ్గినా మళ్లీ పెరిగాయి.
అయితే ఇరాన్ ఈ చర్చలను ఖండించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని పార్లమెంట్ స్పీకర్ Mohammad Bagher Qalibaf తెలిపారు. ఆర్థిక, చమురు మార్కెట్లను ప్రభావితం చేయడానికే ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
Read this article also : US Iran Talks : ట్రంప్ రహస్య చర్చలు..ఎవరా అగ్రశ్రేణి వ్యక్తి ?
“ఇంకా చాలా ఉంది” దాడులు కొనసాగిస్తాం: నెతన్యాహూ
ఇక ఇజ్రాయెల్ ప్రధాని Benjamin Netanyahu దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. “ఇంకా చాలా ఉంది” అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి వివిధ దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.
చమురు మార్కెట్లు కూడా ఉద్రిక్తంగా మారాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు 100 డాలర్ల కంటే దిగివచ్చినా మళ్లీ 104 డాలర్ల వద్దకు చేరాయి. హార్ముజ్ మార్గం మూసుకుపోతే ప్రపంచ ఇంధన సరఫరాపై పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
క్షిపణి దాడులు, పరస్పర హెచ్చరికలు, చర్చలపై అనిశ్చితి… ఇవన్నీ కలిసి ఈ యుద్ధం మరింత విస్తరించే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలు కనిపించకపోవడం గ్లోబల్ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
English Summary
Tensions in the Middle East escalated significantly as Iran launched a direct missile attack on Tel Aviv, Israel’s capital, on Tuesday. The missile struck a busy street, causing significant damage to nearby buildings and injuring four people. This event signifies that Iran’s actions are no longer limited to border conflicts.
In retaliation, Israel Defence Forces (IDF) conducted airstrikes on southern suburbs of Beirut, Lebanon, targeting Iran-backed Hezbollah infrastructure. Lebanon’s health ministry reported several civilian casualties, including children, with many more displaced. The conflict is spreading regionally, with missile alerts in Bahrain, debris in Kuwait, and Saudi Arabia shooting down 19 hostile drones.
Amidst these developments, U.S. President Donald Trump announced talks with Iran, extending the deadline to open the Strait of Hormuz for shipping. He warned of potential strikes on Iran’s power stations if the deadline is not met. However, Iran denied any talks, accusing the U.S. of spreading misinformation to manipulate markets. Israeli PM Benjamin Netanyahu vowed to continue attacks, stating, “there is more to come.” Global oil prices surged again as analysts warned of energy supply disruptions if the Hormuz route is blocked.

