గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్ను.. ‘మాకు ఒక్కమాట చెప్పండి సినిమా చూపిస్తాం’! : ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ కూటమికి ఇరాన్ సవాల్ విసిరింది. తమ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారని, అసలు సిసలు దెబ్బ ఎలా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని ఇరాన్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరాన్ సెటైర్లు వేసింది. ఐరోపా దేశాలు గనుక తమను రక్షణ కోరితే, ట్రంప్ అటువైపు చూడకుండా తరిమేస్తామంటూ ఇరాన్ పోలీస్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ రెజా రాదాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
“ఐరోపా దేశాలారా.. మీరు గ్రీన్‌లాండ్‌ను కాపాడుకోలేకపోతే మాకు ఒక అభ్యర్థన పంపండి, మేము వచ్చి మీకు సహాయం చేస్తాం” అంటూ అహ్మద్ రెజా రాదాన్ చేసిన వీడియో ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూనే, ఐరోపా దేశాలను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగానే ఇరాన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు డెన్మార్క్ ప్రభుత్వం కూడా ట్రంప్ దూకుడును అడ్డుకునేందుకు ఇప్పటికే గ్రీన్‌లాండ్‌లో భారీగా సైన్యాన్ని మోహరించింది.
Read this article also: ఖతార్‌లో విషాదం: కూలిన మిలిటరీ హెలికాప్టర్
English Summary: Amidst escalating military tensions in the Middle East, Iranian leadership has issued a defiant message to the U.S.-Israel alliance, claiming their national strength has been vastly underestimated. In a strategic rhetorical move, Iranian officials—specifically Brigadier General Ahmad Reza Radan—have addressed the growing concerns in Europe regarding U.S. President Donald Trump’s repeated threats to annex Greenland.
Iran has made a provocative “offer” to European nations: if they feel unable to defend the sovereign territory of Greenland (a constituent country of the Kingdom of Denmark) from American encroachment, they need only ask for Iran’s assistance. The Iranian leadership claimed they could “drive Trump away” and ensure he wouldn’t even “look in that direction” again.
Iran #DonaldTrump #Greenland #USIranConflict #InternationalNews #AndhraPulse #WorldWar3

