March 23, 2026

బెంగాల్‌లో జనాభా మార్పు జరిగిపోయింది. | Bengal Demographic Shift Alarms

Sukanth Mazumdhar

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనలో వేగవంతంగా జనాభా మార్పు జరిగిపోతోందని, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హిందువులు త్వరలోనే మైనారిటీలుగా మారే ప్రమాదం ఉందని, అదే జరిగితే భవిష్యత్తులో ఆయా ప్రాంతాల నుంచి హిందూ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రానప్పటికీ, ఈసారి బీజేపీ తన ఎన్నికల వ్యూహాలను పూర్తిగా మార్చుకున్నట్లు మజుందార్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను బలోపేతం చేయడం, బెంగాలీ సంస్కృతికి అద్దం పట్టేలా ప్రచార శైలిని రూపొందించడంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాలో అక్రమాలను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ప్రక్రియ ద్వారా ఎన్నికల సమీకరణలు పూర్తిగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో చోటుచేసుకున్న జనాభా మార్పుల ప్రభావం ఓటింగ్ సరళిపై పడకుండా ఉండాలంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.

Read this article also: తమిళనాడు ఎన్నిలు: సీట్ల సర్దుబాటుపై ముదురుతున్న ఉత్కంఠ

ఎన్నికల ఫలితాలపై జనాభా మార్పు ప్రభావం

రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి కేవలం సామాజిక అంశం మాత్రమే కాదని, ఇది ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన అంశమని సుకాంత మజుందార్ అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో హిందూ సమాజం తన ప్రాబల్యాన్ని కోల్పోకుండా ఉండాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న జనాభా లెక్కల నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలపై బీజేపీ ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ఆయన ఈ సందర్భంగా వివరించారు.

SukantaMajumdar #WestBengalPolitics #BJP #TMC #DemographicShift #BengalElections #AndhraPulse

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *