March 23, 2026

తిరుపతికి బలమైన నాయకత్వాన్ని అందించిన తొలి నగర పాలక సంస్థ.

Dr. Sireesha

తిరుపతి తొలి నగర పాలక సంస్థ తన ఐదు సంవత్సరాల కాల పరిమితిని పూర్తి చేసుకుంది. మేయర్ డా శిరీష గారి నాయకత్వంలో కౌన్సిల్ వివాద రహితంగా తమ బాధ్యతలను నిర్వహించింది.. అటు పోట్లు ఎన్ని ఉన్నా తిరుపతి నగర రూపురేఖలను మార్చేందుకు బలమైన పునాదులను వేయడంతో పాటు బలమైన నూతన నాయకత్వాన్ని తిరుపతి నగర ప్రజలకు అందించింది.. మేయర్ గా డా శిరీష, బలమైన నేతగా పరిణితి చెందితే డా.సంధ్య, పలువురు కార్పొరేటర్లు నాయకత్వ స్తాయి లక్షణాలను కలిగిన వారిగా తిరుపతి నగరం ముందు ఆవిష్కృతమయ్యారు. ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు రాణించడం మనేది తిరుపతి నాయకత్వానికి మంచి పరిణామం.

రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన మేయర్ డా. శిరీష

తిరుపతి నియోజకవర్గ రాజకీయాలలో అతిరధ మహారధులు ప్రాతినిద్యం వహించారు.. పురపాలక చైర్మన్ లు గా పనిచేసిన గొప్పవారు ఉన్నారు.. ఈ నేపథ్యంలో తిరుపతి నగర పాలక సంస్థగా మారిన తర్వాత తొలి నగర పాలక సంస్థకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో డా శిరీష మేయర్ గా బాధ్యతలు చేపట్టారు.. డా శిరీష ఎంపిక వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక సాహసం మరియు చరిత్రను గుర్తు చేసుకోవడం కూడాను… ఎందుకంటే తిరుపతి జనరల్ మేయర్ స్తానం. అలాంటి స్తానంలో బీసీ మహిళ అయిన డా శిరీష ను మేయర్ గా ఎంపిక చేయడం ఒక సంచలనం అయితే.. చారిత్రకంగా తిరుపతి గోవిందరాజ పురంతో పురుడు పోసుకుంది.. చారిత్రక ఆధారాల మేరకు పునాదులు వేసింది యాదవ వంశానికి చెందిన గట్టురాజులు.. తిరుపతికి పునాదులు వేసిన యాదవ సామాజిక వర్గానికి తిరుపతిలో రాజకీయ నాయకత్వం అన్నది ఒక కళగా నిలిచిపోయింది.. అదే సామాజిక వర్గానికి చెందిన డా శిరీష ను మేయర్ గా చేయడంతో చారిత్రక పాత్ర పోషించిన వారికి సముచిత స్థానం కల్పించినట్లు అయినది.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ సంచలన , సాహసోపేత నిర్ణయాలు పలితంగా ఈ మంచి రాజకీయ నిర్ణయం సాధ్యం అయినది.

రాజకీయాలకు కొత్త, ఉన్నత విద్యావంతురాలు అయిన డా శిరీష మేయర్ గా విజయవంతం అయినారు అనడం కన్నా రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చారనడం సముచితంగా ఉంటుంది.. ప్రజలు, పార్టీ ద్వారా హోదాలు వస్తాయి.. వారి పట్ల ఎంత బాధ్యతగా ఉంటాము అన్నది అధికారంలో ఉన్న వారి బాధ్యత అని నమ్మి ఆ మార్గంలో నడుచుకున్న వ్యక్తి డా శిరీష.. అనుభవం లేకపోయినా అత్యంత పరిణితి చెందిన నేతగా ప్రవర్తించారు.. పలితంగా పరస్పర భిన్నమైన రెండు ప్రభుత్వాల కాలంలో కూడా ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా హుందాగా మేయర్ స్తానాన్ని నిలబెట్టారు.. మెతకలో గట్టి స్వభావం కలిగిన డా శిరీష క్లిష్ట సమయంలో గట్టిగా పార్టీ వైపు, ప్రజల వైపు నిలబడ్డారు.. తన ఐదు సంవత్సరాల కాలంలో తన రాజకీయ భవిష్యత్తు పై నిత్యం అనేక ప్రచారాలు జరిగినా వెరవకుండా కాలమే సమాధానం చెప్పాలని నమ్మి నిలబడ్డారు.. అన్నింటికి సమాధానం ఇచ్చారు.. విలువలు, విశ్వసనీయత, హోదాకు కారణం అయిన వారి పట్ల విధేయత, ప్రజల పట్ల వినయంతో డా శిరీష పరిణితి చెందిన నేతగా తిరుపతి ప్రజల ముందు నిలబడ్డారు.

ప్రస్తుత రాజకీయాలలో అసహనం, అభ్యంతకర ధోరణులతో రాజకీయాలు అంటేనే అసహ్యించుకునే పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరం.. ఇలాంటి అసహజ వాతావరంలో మంచి వారు, విలువలు విశ్వసనీయత కలిగిన వారు రాజకీయాలకు దూరం అవుతారు. ఇలాంటి సమయంలో పరిస్తితులను అసహ్యంచుకోవడం కాదు ఎదురొడ్డి నిలబడాలి అప్పుడే రాజకీయాలు మారుతాయని, పద్ధతిగా కూడా రాజకీయాలు చేయవచ్చు అని తాను నమ్మి నిరూపించారు.. కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అనుకునే వారికి మంచి ఉదాహరణగా నిలిచారు డా శిరీష..

తొలి నగర పాలక సంస్థ డా.సంధ్య మరియు పలువురు నాయకత్వ లక్షణాలను కలిగిన కార్పొరేటర్లును అందించింది. స్థూలంగా తిరుపతి తొలి నగర పాలక సంస్థ మేయర్ డా. శిరీష తిరుపతి నగరానికి బలమైన నేతను అందించిందని చెప్పవచ్చు.

తిరుపతికి మంచి రాజకీయ నేతలను అందించిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. డా. శిరీష గారి నాయకత్వంలో తిరుపతి తొలి నగర పాలక సంస్థ తన ఐదు సంవత్సరాల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపద్యంలో వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.

అభినందనలతో…..

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి,
సమన్వయ కర్త,
రాయలసీమ మేధావుల ఫోరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *