టీటీడీ కీలక సమీక్షలో నాణ్యతా ప్రమాణాలపై చర్చ
తిరుమల, మే 30: తిరుమల శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (SVBC) కార్యక్రమాలను మరింత నాణ్యంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ కీలక సమీక్ష సమావేశం నిర్వహించింది. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో జె. శ్యామలరావు అధ్యక్షత వహించారు.
భక్తిని బలపరిచే పథకాలు – ఛానెల్‌కు కొత్త ఊపిరి
ఈ సందర్భంగా చైర్మన్ బీ.ఆర్. నాయుడు మాట్లాడుతూ, “శ్రీవారి భక్తుల మనసు దోచేలా ఎస్వీబీసీ కార్యక్రమాలు రూపొందించాలి. విజువల్ ఆకర్షణతో పాటు ఆధ్యాత్మికతను సమపాళ్లలో అందించాల్సిన అవసరం ఉంది,” అని సూచించారు.
ఈవో జె. శ్యామలరావు మాట్లాడుతూ, “ఆధ్యాత్మికతను యువతకు చేరువ చేసేలా ఇన్నొవేటివ్ కంటెంట్ అవసరం. నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి, మరింత పాంచజన్య ధ్వని వినిపించేలా ఉండాలి,” అని పేర్కొన్నారు.
నిపుణుల సూచనలతో మారుతున్న ప్రసార విధానం
సమీక్షా సమావేశంలో సాంకేతిక నిపుణులు శ్రీనివాసరెడ్డి, రవికుమార్, శ్రీనివాస్‌లు పాల్గొని, SVBC కంటెంట్‌ను నవీకరించేందుకు అనేక విలువైన సూచనలు చేశారు. ఛానెల్ కార్యక్రమాలకు దృశ్యోన్ముఖత, ఆధ్యాత్మికత, సమకాలీనత కలగలిపేలా మార్పులు చేయాలన్నారు.
పాల్గన్న ముఖ్యులు
ఈ సమావేశంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈఓ మరియు ఎస్వీబీసీ సీఈఓ ఇన్‌చార్జి వీరబ్రహ్మం, ఓఎస్డీ పద్మావతి తదితరులు హాజరయ్యారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.