March 18, 2026

ట్రంప్‌నకు ఇంటి పోరు: జో కెంట్ రాజీనామాతో షాకింగ్ నిజాలు..!

comments on Trump

నాటో దేశాలు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయి?

వాషింగ్టన్: అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఒక అసాధారణ అంతర్గత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుండి. యుద్ధంలో తమతో చేతులు కలపాలనే పిలుపునకు నాటూ దేశాలు ముఖం చాటేశాయి. ఇలాంటి తరుణంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్ జో కెంట్ చేసిన రాజీనామా చేశారు. ఈ పరిస్థితులు అగ్రరాజ్య రాజకీయాలను కుదిపేస్తోంది.ట్రంప్ విదేశాంగ విధానంపై పెను విమర్శలు పెల్లుబుకుతున్నాయి. సొంత రిపబ్లికన్ పార్టీలోనే అగ్నిపర్వతంలా అసమ్మతి రగులుతోంది. ఇన్ని సమస్యలు అసలెందుకు చుట్టుముట్టాయి? ఇరాన్ యుద్ధం చుట్టూ ఏం జరుగుతోంది.

జో కెంట్ రాజీనామా: ఒక నమ్మకస్థుడి తిరుగుబాటు

జో కెంట్ కేవలం ఒక అధికారి మాత్రమే కాదు, ట్రంప్ సిద్ధాంతాలకు అత్యంత విధేయుడైన వ్యక్తి. అటువంటి ప్రముఖమైన వ్యక్తి ఉన్నట్లుండి తన పదవికి రాజీనామా చేశారు. “నా అంతరాత్మ ప్రభోదం మేరకు ఈ యుద్ధానికి మద్దతు ఇవ్వలేను” అని ప్రకటించడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆశ్చర్యపరిచింది. ‘ఇరాన్ నుండి అమెరికాకు ఎటువంటి తక్షణ ముప్పు (Imminent Threat) లేద’ని కెంట్ స్పష్టం చేశారు. పైగా ‘ఇజ్రాయెల్ లాబీ ఒత్తిడితోనే ఈ యుద్ధాన్ని కొని తెచ్చుకు’న్నారని ఆయన ఆరోపించారు. ఇది ట్రంప్ ప్రభుత్వానికి ఊహించని పరిణామం. కేవలం ఒక వారం క్రితం వరకు ట్రంప్ పక్షాన నిలిచిన కెంట్, ఇప్పుడు బహిరంగంగానే అధ్యక్షుడి నిర్ణయాలను తప్పుపట్టడం వల్ల గూఢచారి సంస్థల్లోనూ, పెంటగాన్ లోనూ ట్రంప్ పట్ల నమ్మకం సన్నగిల్లుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నాటో దేశాలు ఎందుకు ముఖం చాటేస్తున్నాయి?

హార్ముజ్ జలసంధిని రక్షించడానికి తమ నౌకలను పంపాలని ట్రంప్ చేసిన అభ్యర్థనను జర్మనీ, ఫ్రాన్స్, మరియు లక్సెంబర్గ్ వంటి దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. దీని వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:

యుద్ధం ప్రారంభించే ముందు ట్రంప్ తమను సంప్రదించలేదని, నాటోతో మాట వరుసకైనా చెప్పలేదనేది ఆ దేశాల అభిప్రాయం. ఇది కేవలం అమెరికా సొంత నిర్ణయమని నాటో దేశాలు వాదిస్తున్నాయి. “మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు, కాబట్టి ఇది మా యుద్ధం కాదు” అని జర్మనీ రక్షణ మంత్రి ఘాటుగా స్పందించారు.

ఆర్టికల్ 5 నిబంధన ప్రకారం నాటోలోని ఏ దేశంపై ప్రత్యక్షంగా దాడి జరగలేదు, కాబట్టి సామూహిక రక్షణ ఒప్పందం (Article 5) ఇక్కడ వర్తించదని ఐరోపా దేశాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ఐరోపా దేశాలు, ఇప్పుడు మధ్యప్రాచ్య సంక్షోభంలో చిక్కుకుని మరింత నష్టపోవడానికి సిద్ధంగా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే ట్రంప్ పిలుపునకు ఆ దేశాలు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. పట్టించుకోలేదు.

Read this article also: నిప్పుల కొలిమిలా మధ్యప్రాచ్యం: ఇరాన్ టాప్ కమాండర్ల హతం..

‘అమెరికా ఫస్ట్’ వర్సెస్ ‘వార్ హ్యాక్స్’

రిపబ్లికన్ పార్టీలో ప్రస్తుతం రెండు వర్గాల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది. లిండ్సే గ్రాహం వంటి సీనియర్ నేతలు ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఇరాన్ అణు ముప్పును తొలగించడానికి ఇదే సరైన సమయమని వాదిస్తున్నారు.

మరోవైపు, థామస్ మాస్సీ వంటి నేతలు ఇది “అమెరికా ఫస్ట్” సిద్ధాంతానికి విరుద్ధమని భావిస్తున్నారు. విదేశీ యుద్ధాల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను తగలేయడం వల్ల అమెరికా మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న గ్యాస్ ధరలు (Oil Prices) సామాన్య ఓటర్లలో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని మెజారిటీ రిపబ్లికన్ ఎంపీలు భయపడుతున్నారు.

Read this article also : గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణుల వర్షం.. దుబాయ్, దోహాలో పేలుళ్లు.. రంగంలోకి ట్రంప్!

ట్రంప్ పట్ల అధికారుల్లో అసహనం: విచక్షణారహిత నిర్ణయాలే కారణమా?

కేవలం జో కెంట్ మాత్రమే కాదు, ప్రస్తుత పరిపాలనలోని పలువురు ఉన్నతాధికారులు ట్రంప్ శైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇరాన్ ముప్పును అతిగా చూపిస్తున్నారనే విమర్శలు ఇంటెలిజెన్స్ విభాగం నుండి వస్తున్నాయి. సైనిక అధికారులను సంప్రదించకుండానే ట్రంప్ సోషల్ మీడియాలో యుద్ధ ప్రకటనలు చేయడం వారికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. నౌకలను ముంచడం ‘సరదా’ అని వ్యాఖ్యానించడంపై మిలిటరీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. అత్యంత ప్రొఫెషనల్ మిలిటరీ వర్గాలను ఈ వ్యాఖ్యలు ఇబ్బంది పెడుతున్నాయి.

వైట్‌హౌజ్‌లో అమెరికా జాతీయ భద్రత కంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన అధికారుల్లో బలంగా నాటుకుపోతోంది.

ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న చర్చ కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు, దేశ సార్వభౌమాధికారం మరియు విదేశీ లాబీల ప్రభావం గురించి కూడా. జో కెంట్ రాజీనామా అనేది ఒక ప్రారంభం మాత్రమే కావచ్చు. ఒకవేళ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగి, అమెరికా సైనికుల మరణాలు పెరిగితే, ట్రంప్ తన సొంత పార్టీ నుండే భారీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతర్జాతీయంగా ఒంటరైన అగ్రరాజ్యం, ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ డాలర్ల ప్రశ్న.

Trump #IranWar #JoeKent #NATO #USPolitics #MiddleEastCrisis #InternationalNews #AndhraPulse #BreakingNews #రాజకీయ_విశ్లేషణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *