March 16, 2026

కోస్తా కొబ్బరితోటలో.. ఇరాన్ విస్తోటనం

COCONUT TREES

COCONUT TREES

కోనసీమ కొబ్బరి ఎగుమతులపై పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) యుద్ధ వాతావరణం కోలుకోలేని దెబ్బ తీసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్లాల్సిన ఎగుమతులు నిలిచిపోయాయి. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కేరళ, తమిళనాడు మార్కెట్లపై తీవ్రంగా పడింది. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన టన్నుల కొద్దీ కొబ్బరి కాయలు ఓడరేవుల్లోనే నిలిచిపోవడంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా రంజాన్ మాసం కావడంతో గల్ఫ్ దేశాలైన దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, ఒమన్‌లలో కోనసీమ కొబ్బరికి భారీ డిమాండ్ ఉండేది. అక్కడి సాంప్రదాయ వంటకాలతో పాటు సౌందర్య సాధనాల తయారీలోనూ మన కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ముంబై, చెన్నై, తూత్తుకూడి పోర్టుల్లో కంటెయినర్లు నిలిచిపోయాయి. ఎగుమతులు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయో తెలియని అయోమయ స్థితి నెలకొంది.

హోటళ్లపై ఎల్‌పీజీ కొరత ఎఫెక్ట్.. కట్టెల పొయ్యిలే దిక్కా? ఈ వార్తను కూడా చదవండి

గత నెలలో శివరాత్రి సమయంలో కోనసీమ మార్కెట్‌లో కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉండేవి. వెయ్యి పచ్చి కాయల ధర రూ.18,000 నుండి రూ.20,000 వరకు పలికింది. అయితే ఎగుమతులు ఆగిపోవడంతో ప్రస్తుతం ఆ ధర రూ.13,000 నుండి రూ.14,000లకు పడిపోయింది. ఓడరేవుల్లో నిలిచిపోయిన సరుకును తక్కువ ధరకే స్థానిక మార్కెట్లలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వ్యాపారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు.

ఏపీలో కొబ్బరికి నిలయమైన అంబాజీపేట మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. ప్రతిరోజూ పదుల సంఖ్యలో లారీలు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు వెళ్లాల్సిన చోట ఎగుమతులు పూర్తిగా పడిపోయాయి. శ్రీరామనవమి పండుగ సీజన్‌లో మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు ఈ యుద్ధం తీరని శోకాన్ని మిగిల్చింది. పచ్చి కాయలతో పాటు కురిడీల ధరలు కూడా అమాంతం పడిపోవడంతో సాగు పెట్టుబడులు కూడా దక్కేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

KonaseemaCoconut #AmbajipetaMarket #FarmersIssues #MiddleEastWar #ExportCrisis #CoconutPrices #APEconomy #AgriNews

హోటళ్లపై ఎల్‌పీజీ కొరత ఎఫెక్ట్.. కట్టెల పొయ్యిలే దిక్కా? ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *