March 16, 2026

సినిమా స్టంట్ కాదు.. అదుపుతప్పి దూసుకొచ్చిన మృత్యువు..

Odisha accident Vedio viral

స్పీడు అంటే ప్రాణాలతో చెలగాటమే!

సినిమాల్లో మనం చూసే బైక్ స్టంట్లు, కార్ రేసింగులు చూసి రోమాంచితం అవుతాం. కానీ, అవన్నీ నిపుణుల సమక్షంలో, పూర్తి భద్రతా ప్రమాణాల మధ్య జరుగుతాయి. ఒకవేళ ఆ స్టంట్లు రియల్ లైఫ్‌లో జరిగితే ఎలా ఉంటుందో, ఒడిశాలో జరిగిన ఈ భయంకరమైన ప్రమాద దృశ్యాలే నిదర్శనం. ఒడిశా రాష్ట్రంలోని బాలాపాలా (Balapala, Simulia) ప్రాంతంలో జరిగిన ఒక భయంకరమైన బైక్ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతివేగంతో వచ్చిన ఒక బైక్, అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న మరో బైక్ ను ఢీకొట్టడమే కాకుండా, ఎదురుగా వస్తున్న పాదచారిని కూడా ఈడ్చుకుంటూ వెళ్లి గోడకు కొట్టింది. సిసిటివి కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు.

హెల్మెట్ ప్రాధాన్యత: ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు నిలవాలంటే హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ దృశ్యాలు గుర్తు చేస్తున్నాయి.

ఈ వీడియో సోర్స్ : వాట్సాప్

Read this article also : పుంగనూరులో మృత్యుఘోష: బైక్ ఇంజన్ ఆన్ చేసి పెట్టి.. నిద్రలోనే నలుగురు బలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *