జనసేన పార్టీ బలోపేతానికి కృషి: ఉయ్యాల ప్రవీణ్
NAIDUPETA JANASENA
జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయుడుపేటలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
12 ఏళ్ల ప్రస్థానం.. అచంచల విశ్వాసం
రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ పన్నెండేళ్ల క్రితం పెట్టిన జనసేన పార్టీ, నేడు అధికారంలో భాగస్వామి కావడం ప్రతి జనసైనికుడి విజయం అని ఉయ్యాల ప్రవీణ్ అన్నారు. ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పార్టీని నడిపించిన పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడవటం గర్వంగా ఉందన్నారు. నియోజకవర్గంలో పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసిన వీరమహిళలకు, జనసైనికులకు ఆయన ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా కర్తవ్యం
తనపై నమ్మకం ఉంచి నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఉయ్యాల ప్రవీణ్ స్పష్టం చేశారు. నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవించాలని, పార్టీ విలువలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు – అన్నదానం
పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు తమ పాత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా వచ్చిన జనసైనికులతో పార్టీ ఆఫీస్ కిక్కిరిసిపోయింది. సమావేశం అనంతరం సీనియర్ నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు, వీర మహిళలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
JanasenaParty #Janasena13thAnniversary #PawanKalyan #UyyalaPraveen #Naidupeta #Sullurupeta #JanasenaWaves #APPolitics

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
