March 14, 2026

ఇదేం.. అగ్రరాజ్యం ! 70 సెకన్లలో రూ.16 కోట్ల సొత్తు లూటీ! వైరల్ వీడియో!

Robbary

పాతకాలంలో దోపిడి దొంగల ముఠాలు ఊళ్ళ మీద పడి దోపిడీకి పాల్పడేవి. ఉన్న పళంగా కనిపించినవి పట్టుకుని ఇల్లు గుల్ల చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఆటవిక రాజ్యంలో జరిగేవి. కానీ, ఆధునిక సమాజంలో అలాంటి మచ్చకు కూడా కనిపించవు. మన చంబల్ ముఠా ఏనాడో అంతరించిపోయింది. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా ఇంకా ఇలాంటి సీన్లు ఆవివష్కృతమవుతున్నాయి. కేవలం 70 అంటే 70 సెకనులలో ఒక బంగారు నగల దుకాణంలో రూ. 16 కోట్ల దోపిడికి పాల్పడ్డారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ సంతతికి చెందిన వ్యాపారులే లక్ష్యంగా మరోసారి వ్యవస్థీకృత నేరగాళ్లు రెచ్చిపోయారు. ఫ్రీమాంట్‌లోని ‘కుమార్ జ్యువెలర్స్’పై ఓ సాయుధ ముఠా మెరుపు దాడి చేసి సినిమా ఫక్కీలో భారీ దోపిడీకి పాల్పడింది. కేవలం 70 సెకన్ల వ్యవధిలోనే సుమారు 16 కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ అరాచకానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే వర్మ కుటుంబానికి చెందిన కుమార్ జ్యువెలర్స్ వెలుపల మూడు వాహనాలు వచ్చి ఆగాయి. వాటిలో నుంచి సుమారు 20 మంది ముసుగులు ధరించిన దుండగులు సుత్తులు, రాడ్లతో షాపులోకి చొరబడ్డారు. లోపలికి రాగానే డిస్‌ప్లే కేసింగ్‌లను సుత్తులతో పగులగొట్టి భీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డును గన్‌తో బెదిరించి కేవలం ఒక నిమిషం 10 సెకన్లలోనే 75 శాతం నగలను బ్యాగుల్లో నింపుకుని సిద్ధంగా ఉన్న కార్లలో పారిపోయారు.

వ్యూహాత్మక విశ్లేషణ ప్రకారం కాలిఫోర్నియాలో ‘స్మాష్-అండ్-గ్రాబ్’ తరహా దాడులు గత కొంతకాలంగా పెరుగుతున్నాయి. చిన్న వయసు వారే ఇలాంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వయస్సు 19 నుండి 20 ఏళ్ల లోపు మాత్రమే ఉంది. వీరికి ఫెడరల్ కోర్టులో 20 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. భారతీయ వ్యాపారులు ఆర్థికంగా బలంగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ దాడుల నేపథ్యంలో విదేశాల్లోని వ్యాపారులు అత్యాధునిక సెక్యూరిటీ అలారమ్స్ మరియు గ్లాస్ బ్రేక్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దోపిడీ జరిగిన సమయంలో ప్రతిఘటించడం కంటే ప్రాణాలను కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థీకృత నేరాలపై కఠిన చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని భారతీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

English Summary:
A high-profile robbery took place at ‘Kumar Jewelers’ in Fremont, California, owned by an Indian-origin family. An organized gang of 20 masked men looted $1.7 million (approx. Rs 16 crore) worth of jewelry in just 70 seconds. The gang used hammers to smash display cases and fled in stolen vehicles. US authorities have arrested four suspects aged 19-20, while the investigation continues. The Indian community expressed concern over rising ‘Smash-and-Grab’ crimes.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *