నిలువెల్లా జాతి వివక్షను కలిగిన బ్రిటిష్ యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ మరోమారు భారతీయులపై హేయమైన జాతివివక్షను కలిగిన వ్యాఖ్యలు చేశాడు. నోటికొచ్చినట్లు మాట్లాడాడు. తమ ప్రతిభతో భారత సంతితికి చెందిన వ్యక్తి ఆ దేశపు ప్రధాన మంత్రికాగలిగాడన్న మాటలను మరిచిన ఇతగాడు భారతీయులపై నోరు పారెసుకుంటున్నాడు. గతంలో ‘అణుబాంబులతో భారత్‌ను లక్ష్యంగా చేశానన్న’ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇతగాడి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి, జాతివివక్ష ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటాడో బ్రిటన్‌కు చెందిన యూట్యూబర్ మైల్స్ రౌట్లెడ్జ్ అలానే ఉంటాడు. బ్రిటీష్ పాలకులమన్నఅహంకారం ఇతగాడిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇతగాడు మరోసారి భారతీయులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎక్స్ ఖాతాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని కారుకూతలు కూశాడు. “ఇంటర్వ్యూలలో అబద్ధాలు చెప్పే వారు, దుర్వాసన వచ్చే వారు, ఇంగ్లిష్ మాట్లాడలేని వారు”గా అభివర్ణించాడు.
తనకు గూగుల్ హెచ్ఆర్‌లో ఓ స్నేహితుడు ఉన్నాడని, అతడి ప్రకారం 80 శాతం ఉద్యోగ దరఖాస్తులు భారతీయులవేనని రౌట్లెడ్జ్ పేర్కొన్నాడు. అంతేకాదు, వారిలో చాలా మంది ఇంటర్వ్యూల్లో ఓపెన్‌గా అబద్ధాలు చెబుతున్నారని చెప్పారట.
“ఒకరేమో తన సోదరుడు గూగుల్‌ను స్థాపించడంలో సహాయం చేశాడంటాడట, మరొకరు ‘సీఈఓకు ఉద్యోగం వచ్చేలా చేశాను, ఇప్పుడు నాకు సహాయం చేస్తాడనేంతగా అబద్ధాలు చెబుతారని వ్యాఖ్యానించారు.
“చాలామంది ఇంగ్లిష్ మాట్లాడలేరు, వారి ఉచ్చారణను గూగుల్ టీం భరించలేకపోతుంది. ప్రత్యక్ష ఇంటర్వ్యూల సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతా సమస్యలు ఉంటాయని చెప్పారు” అని రౌట్లెడ్జ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.
పనీపాట లేకుండా గాలి తిరుగళ్ళు తిరిగే ఇతగాడికి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటే. అవే అతగాడికి ఆహారం. అతగాడికి సమాచారం హెచ్‌ఆర్ పని చేస్తున్న గూగుల్ సిఈవో భారతీయుడే, అంతెందుకు మీ దేశాన్ని పాలించిన ఋషి సునక్ భారత సంతితికి చెందినవాడే. భారతీయులు లేని బ్రిటన్ ఊపిరి కూడా పీల్చుకోలేని స్థితికి వచ్చినా కండకావరం మాత్రం తగ్గడంలేదు ఇతగాడికి
మైల్స్ రౌట్లెడ్జ్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువయ్యాడు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో అక్కడికి ప్రణాళికాబద్ధంగా వెళ్లాడు. అక్కడ చిక్కుకుపోయిన అతడిని రక్షించాల్సి వచ్చింది. 2023లో అతడిని తాలిబాన్ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.