- పోరాటాలతో పుట్టిందే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
- తిరుపతి రూరల్ మండల పార్టీ నేతల సమీక్షలో నేతల సూచన
చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వద్ధామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపికైన నూతన కార్యవర్గంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోనే పోరాట పటిమతో పుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలని, జగనన్న స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉధ్యమించాలన్నారు.
ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లో ఎండగట్టడానికి నిరంతరం కష్టపడి పనిచేయాలని అన్నారు. ప్రతిపక్షంలో వున్నపుడు పోరాటం తప్ప వేరే మార్గం లేదన్నారు. అధికార పార్టీ నేతలు గ్రామ స్థాయిలో చేస్తున్న అవినీతి, అరాచకాలు, అవినీతి, అక్రమాలను ప్రజల ముందు పెట్టడానికి మీడియా, సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలన్నారు. తిరుపతి రూరల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపాటి మునీశ్వరరెడ్డి మాట్లాడుతూ పార్టీలో ఎవ్వరికి ఏలాంటి కష్టం వచ్చినా అందరూ ఒకటై అండగా నిలబడతామని చెప్పారు.
గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమైతే మండల స్థాయిలో పార్టీ జోరుగా పుంజుకుంటుందన్నారు. కేంద్రపార్టీ కార్యాలయం నుంచి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక్కొక్క పంచాయతీ నుంచి ఐదుగురు నాయకులు హాజరైతే వందల మంది రోడ్డు పైకి వచ్చినట్టవుతుందని, పార్టీ కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఎన్ని పనులు వున్నప్పటికీ ఒక గంట సమయం కేటాయించి తప్పక హాజరు కావాలని సూచించారు.
అంతకు ముందు రాష్ట్ర పార్టీ నాయకులు చిలమంద మునిక్రిష్ణ, తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ విడుదల మాదవరెడ్డి, చెంచుమోహన్ యాదవ్ , దామినేటి కేశవులు మాట్లాడుతూ పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా వున్నారని, వారిని నడిపించే నాయకత్వం బలోపేతం చేయడానికే ఈ కమిటీలు వేయడం జరిగిందన్నారు.
చంద్రగిరి నియోజక వర్గం పార్టీ సమన్వకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంతో నమ్మకంతో ఇచ్చిన పదవులకు వన్నెతెచ్చేలా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలన్నారు. మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లో పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలను అవగతం చేసుకుని ప్రతి పల్లెలో చర్చకు తీసుకురావాలన్నారు.
కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిన సందర్బంగా ప్రతి పల్లెలో నిరసన కార్యక్రమాలు చేసి, ప్రజలను ఏ విధంగా ఈ ప్రభుత్వం వంచించిందో అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఈ సమావేశంలో కొత్తగా నియమితులైన మండల పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.