March 27, 2026

మహానాడు కి 25 లక్షల రూపాయలు విరాళం

దాత ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు

కడప లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు 2025 కి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు  25 లక్షలు రూపాయలు విరాలాన్ని చెక్కు రూపంలో ఈరోజు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి వర్యులు  అనగాని సత్యప్రసాద్  అందచేశారు.

ఈ సందర్బంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొట్ట మొదటి మహానాడుని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.

రాష్ట్ర నలుమూలల నుండి కడప వచ్చే వారికి బస,భోజన ఏర్పాటు లో ‍ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో దామచర్ల సత్య గారు కూడా పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *