జొన్నవాడ ఆలయం మూత
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జొన్నవాడ గ్రామంలో పినాకిని నది తీరాన కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానాన్ని మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా అర్చక స్వాములు మూసివేశారు. ఉదయం 10 గంటలకు దేవస్థానాన్ని మూసి వేయడం జరిగినట్లు అర్చకులు తెలిపారు. తిరిగి ఆలయ శుద్ధి అనంతరం బుధవారం ఉదయం యధావిధిగా దేవస్థానం లో భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.
#Jonnavada #ChandraGrahan2026 #TempleNews #Nellore #KamakshiAmma #SpiritualNews #AndhraPradesh
