
పాకిస్తాన్, భారతదేశాల నెలకున్న యుద్ధ పరిస్థితుల మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి శాంతిని స్థాపించగలిగానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపి సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 10వ తేదీన భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వ వ్యాఖ్యల్ని నిరాకరించారు.
అమెరికా కీలక పాత్ర వహించిందని ట్రంప్ అప్పట్లో పదే పదే చెప్పారు. భారత్–పాకిస్తాన్ మధ్య సమస్యను ట్రేడ్ ద్వారానే పరిష్కరించానని, రెండు దేశాలను హెచ్చరించానని చెప్పారు. తన హెచ్చరికలతోనే రెండు దేశాలు దిగివచ్చాయని అన్నారు.
అమెరికా మధ్యవర్తిత్వం చేసిందన్న వ్యాఖ్యలకు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టంగా స్పందించారు. “మధ్యవర్తిత్వం” అనే పదమే తన పదకోశంలో లేదని తేల్చిచెప్పారు. భారత్–పాక్ మధ్య మే 10వ తేదీన చోటు చేసుకున్న కాల్పుల విరమణకు అమెరికా మద్దతుగా ఉందన్న ట్రంప్ వ్యాఖ్యల్ని థరూర్ తోసిపుచ్చారు.
భారత ప్రభుత్వ వైఖరి అందరికీ స్పష్టంగా తెలుసు. ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా, తాను కాల్ చేసే దేశాలతో సంప్రదింపులు చేస్తుందని అన్నారు. అదే విధానాన్ని అన్ని సందర్భాల్లో భారత దేశం పాటిస్తుందన్నారు. కానీ, ఇది మధ్యవర్తిత్వ ప్రక్రియ కాదనేది స్పష్టం చేశారు. ఎవరైనా కాల్ చేస్తే, తాను ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో చెబుతాను — అంతే అన్నారు. అంతమాత్రన అది మధ్యవర్తిత్వమా? అని ప్రశ్నించారు. అలాంటిది తన పదకోశంలో అలాంటి అర్థం లేదని స్పష్టం చేశారు థరూర్.