కలిగిరిలో మే 23 నుంచి జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కలిగిరి కొండపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 23 నుండి 28వ తేదీ వరకు జీర్ణోద్ధరణ అష్టబంధన సంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
మే 23 (శుక్రవారం) – ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఆచార్యవరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, వేదారంభం, హారతి జరుగుతుంది.
మే 24 – ఉదయం 9 నుండి 12 వరకు యాగశాల వాస్తు, అకల్మష హోమం, రక్షాబంధనం; సాయంత్రం 6 నుండి 8.30 వరకు అగ్ని ప్రతిష్ట, కళాకర్షణ, ఉక్త హోమాలు జరుగుతాయి.
మే 25 – ఉదయం పంచగవ్యాది వాసం, క్షీరాది వాసం, యాగశాల వైదిక కార్యక్రమాలు, హారతి; సాయంత్రం కూడా వైదిక కార్యక్రమాలు, హారతి నిర్వహిస్తారు.
మే 26 – ఉదయం రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన శిఖర స్థాపన, బింబస్థాపన, అష్టబంధన, ద్రవ్యారాధన సమర్పణ, హారతి జరుగుతుంది. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి.
మే 27 – ఉదయం బింబ వాస్తు, నవకలశ స్థాపన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, హారతి; సాయంత్రం మహాశాంతి హోమాలు, పూర్ణాహుతి, శయనాది వాసం, విశేష హోమాలు నిర్వహించనున్నారు.
మే 28 – తెల్లవారుఝామున సుప్రభాతం, మహాపూర్ణాహుతి, యంత్రదానం, కుంభ ప్రదక్షిణ, కళావాహన, బ్రహ్మఘోష, యజమాన ఆశీర్వచనం, ఆచార్య బహుమానం, ధ్వజారోహణం, హారతి జరుగుతాయి. సాయంత్రం 4 నుండి 7 వరకు కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం, ధ్వజావరోహణంతో సంప్రోక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
