చంద్రగిరి కైలాస ధామం నిర్మాణానికి విరాళం
చంద్రగిరి పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కైలాస ధామం’ (శ్మశాన వాటిక ఆధునీకరణ) నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పుణ్యకార్యానికి తమ వంతు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం చంద్రగిరి మండలం మల్లయ్యాపల్లి గ్రామానికి చెందిన కీ.శే శంకరయ్య గారి భార్య కస్తూరమ్మ లక్ష రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
ఎమ్మెల్యే పులివర్తి నానికి నగదు అందజేత
దాత కస్తూరమ్మ గారు విరాళానికి సంబంధించిన నగదును చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారిని స్వయంగా కలిసి అందజేశారు. తన భర్త జ్ఞాపకార్థం ఈ విరాళం అందజేయడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన కస్తూరమ్మ గారిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
దాతకు ఘన సన్మానం
నిర్మాణ పనులకు ఆర్థికంగా అండగా నిలిచిన కస్తూరమ్మ గారిని ఎమ్మెల్యే పులివర్తి నాని గారు మరియు కైలాస ధామం కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కైలాస ధామం అభివృద్ధికి దాతలు ఇలాగే సహకరించాలని కోరారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దాతల సహకారంతో ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
#Chandragiri #KailasaDhamam #PulivarthiNani #Donation #SocialService #TirupatiNews #APPolitics
