తిరుచానూరు పద్మావతి అమ్మవారికి సోమవారం 7 గొడుగులు కానుకగా అందాయి. తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు రెండు గొడుగులను కానుకగా అందించారు.
ఈ గొడుగులను ఆలయం వద్ద టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకు అందించారు. బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజున ఈ ట్రస్టు తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
చెన్నైకి చెందిన హిందూ ధర్మార్థ సమితి అర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఆర్.గోపాల్‌జి ఆధ్వర్యంలో 5 గొడుగులను తీసుకొచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో గోవింద రాజన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.