Shadow of the hand holding a big sharp knife. Murderer, killer or robber with a knife. Criminal. Crime. Horror scene.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లా టీచర్స్ కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి, చివరికి రక్తపాతానికి దారితీసింది. మృతుడు ప్రసాద్ సూర్యవంశీ (25) స్థానిక హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అసలేం జరిగిందంటే?
పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం. గత కొంతకాలంగా ప్రసాద్‌కు, అతని ప్రియురాలికి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. గొడవల కారణంగా విసిగిపోయిన ప్రసాద్, తన ప్రియురాలి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని నిలదీసేందుకు ఆమె ప్రసాద్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె అతని ఫోన్ లాక్కుని చాటింగ్ వివరాలు చూపాలని గొడవ పడింది. ప్రసాద్ నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, వెంట తెచ్చుకున్న కత్తితో అతనిపై దాడి చేసింది.
తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బిలాస్‌పుర్ ఎస్పీ రజనీశ్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
#CrimeNews #Bilaspur #Chhattisgarh #MurderCase #RelationshipIssues #PoliceAction #BreakingNews
