తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నరకచతుర్దశి వేడుకలు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 15 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పుతో ప్రత్యేకంగా నరకాసురుని ప్రతిమ ఆయన తయారు చేయించారు. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన టపాకాయలతో నరకాసురుని ప్రతిమ రూపుదిద్దుకుంది. 52 రకాలు 1లక్ష 72వేల టపాకాయలతో తయారైన నరకాసురుని వధ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ప్రతి ఏటా తుమ్మలగుంటలో ఆనవాయితీగా సాగుతుందని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన గెలుపుకు సూచికంగా నరకాసురుని వధ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. నరకాసురిని వధ కార్యక్రమంను తిలకించేందుకు వందలాదిగా ప్రజలు తరలి వచ్చారు.