అన్నమయ్య జిల్లా నూతన సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన శివ నారాయణ శర్మ
అన్నమయ్య జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా శివ నారాయణ శర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముందుగా నూతన సంయుక్త కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను గౌరవపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్ తో పలు విషయాలు చర్చించారు. అనంతరం వేద పండితులు వేదమంత్రాలతో ఛాంబర్ లోకి ఆహ్వానం పలకగా నూతన సంయుక్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ….గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, అధికారుల సహకారంతో అన్నమయ్య జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ జిల్లాగా నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు.
నూతన సంయుక్త కలెక్టర్ ను మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి, డిఆర్ఓ మధుసూదనరావు, కలెక్టరేట్ ఏవో నాగభూషణం, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
#AnnamayyaDistrict #JointCollector #ShivaNarayanaSharma #Madanapalle #CollectorNishantKumar #AndhraPradeshPolitics #NewAppointment #DistrictAdministration
