శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలు విరాళం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీ మురళీ అనే భక్తుడు రూ.18 లక్షలు విలువ చేసే వంట పాత్రలను విరాళంగా అందించారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట పాత్రలైన సోలా, అర సోలా, పోటు వంట సామాన్లను బుధవారం ఉదయం టిటిడి ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీకి అందజేశారు.
ఈ సందర్భంగా ఎఫ్ ఏ అండ్ సీఏవో శ్రీ ఓ బాలాజీ దాత శ్రీ మురళీని అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వి.ఆర్.శాంతి, ఏఈవో ఏ బీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ పద్మ ప్రియ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
#Tirupati #GovindarajaSwamyTemple #TTD #Donation #Devotee #Prasadam #SpiritualTirupati #TempleNews #AndhraPradesh
