March 11, 2026

Suriya Jyothika : అందుకే ముంబయికి మారాను

Suriya Jyothika జ్యోతిక తన జీవితంలో తన కోసం ఎన్నో చేసిందని, త్యాగాలు కూడా చేసిందని త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు సూర్య తెలిపారు. తాను చెన్నై నుంచి మంబయికి ఎందకు మారాల్సి వచ్చిందో కూడా వివరించారు. ఒక ఇంటర్వ్యూలో సూర్య ఈ విషయాలను వెల్లడించారు. తను ముంబయికి ఎందుకు మారారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేందుకు ఆలస్యం చదివేయండ.

తమిళ సినిమా పరిశ్రమ, ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాలలో సూర్య మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన ఉన్నట్టుండి ముంబైకి మకాం మార్చారు. ముంబాయి మ‌హాన‌గ‌రం నుంచే త‌న సినిమాల షూటింగ్‌ల‌లో పాల్గోంటున్నాడు అక్కడ సినిమాలలో నటించడనికి వెళ్లారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

తాను ముంబై షిఫ్ట్ అవ్వ‌డానికి గ‌ల కార‌ణాన్ని తాజాగా వెల్ల‌డించాడు. తాజా చిత్రం కంగువ‌ పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రీసెంట్‌గా ఒక ఆంగ్ల ఇంట‌ర్వ్యూలో పాల్గోన్న సూర్య తాను ముంబై షిఫ్ట్ అవ్వ‌డానికి గ‌ల కార‌ణాన్ని వెల్ల‌డించాడు.

త‌న‌కి 18 ఏళ్ళ వ‌య‌సులో జ్యోతిక ముంబై నుంచి చెన్నైకి వచ్చిందని, తమ పెళ్ళయి దాదాపు 27 ఏళ్ళుగా జ్యోతిక బంధువులు, స్నేహితులను మిస్సవుతూనే ఉందన్నారు. తన సర్వస్వాన్ని వదులుకుని ఇంకా చెప్పాలంటే త్యాగం చేసి తన కోసం వచ్చిందని అన్నారు. అయితే మగాడికి ఏ విధమైన కోరికలు ఉంటాయో మహిళలకు కూడా అలాగే ఉంటాయని, అందుకోసమే తాను ముంబయికి నివాసాన్ని మార్చానన్నారు.

తను తన తల్లిదండ్రలు, స్నేహితులు, బంధువులతో హ్యాపీగా గడపుతున్నారని, ఇంతకాలం ఆమె మిస్సయినవన్నీ ఆమెకు అందించడానికే ఈ పని చేశానని అన్నారు. ఇలాంటి చిన్న చిన్న ప‌నులే వారికి ఆనంద‌న్ని ఇస్తాయి. అందుకే త‌న కోసం నేను ముంబైకి వచ్చాను అంటూ సూర్య వెల్ల‌డించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *