ఇరాన్ నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు, “సహాయం వస్తోంది.. మీ సంస్థలను మీ ఆధీనంలోకి తీసుకోండి” అంటూ నిరసనల అగ్గి రాజేస్తుంటే, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని రష్యాను హెచ్చరించారు. ట్రంప్ మాత్రం తన సామాజిక మాధ్యమం ద్వారా ‘మగ’ (MIGA – Make Iran Great Again) నినాదాన్ని వినిపిస్తూ రంగంలోకి దిగారు.
నిరసనకారులకు భరోసా.. పాలకులకు అల్టిమేటం
ఇరాన్‌లోని 31 ప్రావిన్సులకు వ్యాపించిన నిరసనలను ఉద్దేశించి ట్రంప్ భావోద్వేగపూరితమైన సందేశం ఇచ్చారు. “ఇరాన్ దేశభక్తులారా.. నిరసనలను ఆపకండి, మీ స్వేచ్ఛ కోసం పోరాడండి” అని పిలుపునిస్తూనే, నిరసనకారులను చంపే వారి పేర్లను నోట్ చేసి ఉంచుకోవాలని, వారు భారీ మూల్యం చెల్లించుకుంటారని పాలకులను హెచ్చరించారు.
నిరసనకారులను ఉరితీస్తే అమెరికా నుండి అత్యంత కఠినమైన చర్యలు (Very Strong Action) ఉంటాయని, అప్పటివరకు ఇరాన్ అధికారులతో జరగాల్సిన అన్ని చర్చలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వైమానిక దాడులు కూడా సాధ్యమేనన్న వైట్ హౌస్ ప్రకటనతో ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి.
రష్యా జోక్యానికి ట్రంప్ ‘రెడ్ లైన్’
మరోవైపు, ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటే వినాశకరమైన పరిణామాలు ఉంటాయన్న రష్యా హెచ్చరికలను ట్రంప్ తోసిపుచ్చారు. రష్యాతో పాటు ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాకు 25 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించి ఆర్థిక యుద్ధానికి తెరలేపారు.
ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేసిన నేపథ్యంలో, స్టార్‌లింక్ ద్వారా కమ్యూనికేషన్లను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. రష్యా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, ఇరాన్ పాలకులకు అండగా ఉండే శక్తులన్నింటికీ ఇది ఒక గట్టి సంకేతమని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.