మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మ.. సోదరి వైఎస్ షర్మిల పై ఎన్ సి ఎల్ టి లో వేసిన కేసుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరతీసింది.. సొంత తల్లి చెల్లిపై కేసులు వేసారంటూ జగన్ పై మరోసారి ఆయన వ్యతిరేక మీడియా సంస్ధలు చెలరేగిపోయాయి.. అయితే ఆ కేసుల వెనుక పెద్ద మర్మమే దాగి ఉందని తెలుస్తోంది..
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలు.. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని ఏర్పాటు చేయడం.. ఆయనపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే.. అయితే అప్పట్లో నమోదు చేసిన సిబిఐ, ఈడి కేసులు ఇప్పటికి కోనసాగుతూనే ఉన్నాయి.. సదరు కేసుల్లో వైఎస్ జగన్ గత 12 ఏళ్లుగా బెయిల్ పై ఉన్నారు.. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తరువాత పార్టీ అధినేత జగన్ కు మరోసారి సిబిఐ ఈడి కేసుల వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
తాజాగా జగన్ మోహన్ రెడ్డి ఎన్ సిఎల్ పిలో తాను గతంలో తల్లి విజయమ్మ పేరును రాసిన ఇచ్చన సరస్వతి పవర్ షేర్లు వైఎస్ షర్మిళ పేరున ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలుసుకున్నారు. అయితే ఈడి జప్తులో జగన్ ఆస్తుల్లో సరస్వతి పవర్ కూడా ఉండటంతో ఇప్పుడు జగన్ కు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నట్టు ఆయన సన్నిహితులు హెచ్చరించినట్టు తెలుస్తోంది.. ఈడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులపై లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లభిస్తే జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నట్టు న్యాయనిపుణులు అంటున్నారట..
దీంతో గతంలో జగన్ తన తల్లి విజయమ్మ పేరిట రాసిన సరస్వతి పవర్ షేర్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని భావిస్తున్నారట.. దీని ద్వారా తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది..2019 ఎన్నికల్లో కనివినీ ఎరుగని విజయాన్ని అందుకున్న జగన్ అధికారం పీఠాన్ని అధిష్టించడం ఆ తరువాత తన సోదరి షర్మిళ మధ్య విబేధాలు పొడచూపాయి..
పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదనే అసంతృప్లితో షర్మిళ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మకాం మార్చారు.. కొన్నాళ్ల తరువాత ఆమె సొంత పార్టీ పెట్టడం ఆపై ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అందరికి తెలిసిందే.. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధీష్టానం షర్మిళను ఏపి కాంగ్రెస్ అధ్యక్షరాలి నియమించింది.. ఆ ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిళ ఒక కారణంగా చెబుతారు రాజకీయ విశ్లేషకులు.. అయితే వీటనిటికన్నా ముఖ్యమైన వ్యవహారం ఇద్దరి మధ్య తెగని ఆస్తుల పంపకం అనేది కొన్ని మీడియా ఛానళ్లు తెరమీదకు తీసుకువచ్చాయి.
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆస్తిలో సమాన వాటా వైఎస్ షర్మిళకు ఇవ్వాలని భావించారని.. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ విధంగా ఇచ్చేందుకు నిరాకరించారని రకరకాల ప్రచారాలు ఉన్నాయి.. అయితే ప్రస్తుతం జగన్ పార్టీ రాష్ట్రంలో ఘోర ఓటమి తరువాత ఆయనకు పరస్ధితులు ప్రతీకూలంగా మారడంతో షర్మిళ అన్నపై పై చేయి సాధించేందుకు తల్లి విజయమ్మ పేరున ఉన్న సరస్వతి పవర్ షేర్లను ఆమె పేరున రాయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది.. అన్న జగన్ పై రాజకీయంగా పలు సందర్భాలలో విమర్శలు చేసిన షర్మిళ ఇప్పుడు నేరుగా ఎటాక్ చేసేందుకే ఇలా చేసారని అంటున్నారు.. షర్మిళ ఎత్తుగడను చూసి విస్తుబోతున్నారు..