చిత్తూరు కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజల ముంగిటకే పాలన.. సత్వర పరిష్కారమే లక్ష్యం. జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో భారీగా తరలివచ్చిన అర్జీదారులు.
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు భరోసా ఇస్తూ, నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పెట్టుకున్న ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరగా పరిష్కరించాలని సూచించారు. జాప్యం జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.
#Chittoor #DistrictCollector #PGRS #PublicGrievance #SumitKumar #ChittoorNews #AndhraPradesh #CitizenRights #RevenueDepartment #Rayalaseema
