తిరుపతిలో 'సిటీ మార్ట్' ప్రారంభం: ప్రారంభించిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
అతి తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన తుడా మాజీ చైర్మన్.
నాణ్యమైన సేవలే లక్ష్యం
తిరుపతి నగరవాసులతో పాటు శివారు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అతి తక్కువ ధరలకే, నాణ్యంగా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘సిటీ మార్ట్’ (City Mart) శనివారం ప్రారంభమైంది. తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మార్ట్‌ను చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి విచ్చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జ్యోతి వెలిగించి మార్ట్‌ను ప్రారంభించారు. సిటీ మార్ట్ యజమాని ప్రతాపరెడ్డి, మోహిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే నాణ్యమైన ప్రొవిజన్స్‌ను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సిటీ మార్ట్ దినదినాభివృద్ధి చెందుతూ, భవిష్యత్తులో మరిన్ని బ్రాంచీలతో పల్లె ప్రాంతాలకు కూడా విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్ట్ సిబ్బంది, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
#Tirupati #CityMart #ChevireddyMohitReddy #YSRCP #TirupatiNews #Shopping #Provisions #Inauguration #Chandragiri #AndhraPradesh
