- ఐటి దాఖలుకు గడువు పెంపు
ITR: ఆదాయపన్ను శాఖ కార్పొరేట్లకు మంచి అవకాశం కలిగించింది. తెలిసో, తెలియకో 2023-24. 2024-25 అంచనాలకు ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు చేయకుండా ఉంటారు. అలాంటివారికి ఇన్కమ్ ట్యాక్స్ మంచి అవకాశాన్ని కలగించింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.
వీరికి నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వివిధ సమస్యలతో ఐటీఆర్ దాఖలు చేయలేని కార్పొరేట్లకు భారీ ఊరటగా చెప్పవచ్చు.
కార్పొరేట్లు ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 31, 2024తో ముగియనుంది. అయితే, పలు సమస్యల కారణంగా ఐటీ రిటర్నుల దాఖలు ఆలస్యమవుతోందన్న కారణాలు తెలుపుతూ పలు సంస్థలు ఆదాయపన్ను శాఖకు వినతులు సమర్పించుకున్నారు.
వారి వినతుల మేరకు ఆదాయపన్ను శాఖ గడువు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల పాటు అంటే నవంబరు 15వ తేదీ వరకూ కార్పొరేట్లు ఐటీ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చుని, ఈ సమయంలో ఎటువంటి పెనాల్టీలు ఉండవని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ సర్క్యూలర్ జారీ చేసింది.
కానీ, రిటర్న్స్ దాఖలు చేసే ముందు దఖలు పరిచే ఆడిట్ నివేదిక, ఫామ్ 3సీఈలో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికేషన్, 10డీఏ ఫామ్ వంటి ఆదాయపు పన్ను ఫారాలలను మాత్రం అక్టోబర్ 31వ తేదీ లోపే సమర్పించాలని కోరింది.