సంక్రాంతికి ‘రాజా సాబ్’ బ్లాక్‌బస్టర్ ఖాయం
ప్రభాస్ నటించిన భారీ హర్రర్ ఫాంటసీ చిత్రం ‘రాజా సాబ్’. (Raja Saab Movie) మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. (Sankranti Movie Release)
ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ప్రభాస్, నిర్మాత విశ్వప్రసాద్ ఈ చిత్రానికి బలంగా నిలబడ్డారని తెలిపారు. ఇది సాధారణ సినిమా కాదని, పెద్ద స్థాయి హర్రర్ ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు. అన్ని భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. (Prabhas New Movie)
ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ప్రత్యేకమైందని, నానమ్మ–మనవడి భావోద్వేగ కథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. జరీనా వాహబ్ నానమ్మ పాత్రలో కీలకంగా కనిపిస్తారని తెలిపారు. హీరోయిన్లు మాళవిక, నిధి, రిద్ధిలు తమ నటనతో మెప్పిస్తారని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు తమన్, సినిమాటోగ్రాఫర్ కార్తీక్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్‌ల పనితీరు సినిమాకు ప్రధాన బలమని అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ఇది తమ సంస్థలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ సినిమా అని, గ్లోబల్ స్థాయిలో హర్రర్ ఫాంటసీ జోనర్లో ‘రాజా సాబ్’ ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని తెలిపారు. సంక్రాంతి రేసులో ఈ చిత్రం ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
#RajaSaab
#Prabhas
#SankrantiRelease
#HorrorFantasy
#TeluguCinema