రాంచీలో భారీ అగ్నిప్రమాదం
జార్ఖండ్ రాజధాని రాంచీలో (Ranchi Fire Accident) భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం పురానా అర్గోరా చౌక్ నుంచి కట్ల మోర్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
మంటల తీవ్రతకు పెద్దఎత్తున పొగలు వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నివాసితులు కిందకు పరుగులు తీశారు. ఘటన ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది (Fire Department) ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. భారీగా నీటిని ప్రయోగించి అగ్నిని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టారు.
అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి (Police Investigation) దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
#RanchiFire
#FireAccident
#JharkhandNews
#ApartmentFire
#BreakingNews