వైభవ్‌కు అత్యున్నత పురస్కారం.. రాష్ట్రపతి చేతుల మీదుగా బాల్ పురస్కార్ ప్రదానం
భారత క్రికెట్‌లో యువ సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీకి ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే వరల్డ్ రికార్డులు సృష్టిస్తున్న ఈ యువ బ్యాటర్‌కు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుక్రవారం ఈ అత్యున్నత అవార్డును వైభవ్ స్వీకరించాడు. (Pradhan Mantri Rashtriya Bal Puraskar)
క్రికెట్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ అరుదైన గౌరవం లభించిందని అధికారులు తెలిపారు. అవార్డు స్వీకరణ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని వైభవ్ కలవనున్నాడు. బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ దేశవాళీ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డు నెలకొల్పాడు. (Vaibhav Suryavanshi Records)
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ, 84 బంతుల్లో 190 పరుగులు చేసి లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగుల మార్కును చేరిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే ఐపీఎల్-2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఆడుతున్న వైభవ్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలోనూ అండర్-19 వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు.
#VaibhavSuryavanshi
#BalPuraskar
#IndianCricket
#YoungCricketStar
#FutureOfIndianCricket