కన్నకూతురు పరువే మిన్న అనుకున్నారు. ఆ తల్లిదండ్రులు… ఎన్నిమార్లు చెప్పిన ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. నవమాసాలు మోసి కన్న తల్లి విషమివ్వగా. చేయిపట్టి నడిపించిన తండ్రే గొంతు నులిమి చంపాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
తెలంగాణ (Telangana) రాష్ట్రం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె అదే గ్రామానికి చెందిన ఒక వివాహమైన యువకుడితో ప్రేమలో పడింది. అతడికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు. యువతి తల్లిదండ్రులు ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రవర్తన తప్పని కూతురిని పలుమార్లు మందలించారు. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, తమ పరువు పోతుందన్న భయంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు.
నవంబర్ 14, 2024న తల్లిదండ్రులు ముందుగా కూతురితో బలవంతంగా పురుగుల మందు తాగించారు. ఆ తర్వాత ఆమె ప్రాణం పోలేదని గమనించి, గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం ఏమీ తెలియనట్లుగా నటించి, తమ కూతురు కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్య కేసుగా నమోదు చేసినప్పటికీ, యువతి మృతదేహంపై ఉన్న గుర్తులు మరియు పోస్టుమార్టం రిపోర్ట్ పోలీసులకు అనుమానం కలిగించాయి.
పోలీసుల లోతైన విచారణ యువతి మృతిపై అనుమానం రావడంతో సైదాపూర్ పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణం సహజమైనది కాదని, గొంతు నులమడం వల్ల శ్వాస ఆడక చనిపోయిందని తేలింది. దీంతో తల్లిదండ్రులను తమదైన శైలిలో విచారించగా, వారు చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. పరువు కోసం ప్రాణం తీశామని వారు అంగీకరించడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
యువతి తల్లిదండ్రుల అరెస్టు
నేరం నిర్ధారణ కావడంతో డిసెంబర్ 25, 2025 న పోలీసులు విచారణ పూర్తి చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.. దీంతో ఈ ‘పరువు హత్య’ మిస్టరీ వీడింది. ఈ కేసులో ఆ యువకుడి పాత్ర ఏమైనా ఉందా? లేదా మరెవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
సమాజంలో పెచ్చుమీరుతున్న పరువు హత్యలు తెలంగాణలో ఇటీవల పరువు హత్యలు (Honour Killings) పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారాలను పరిష్కరించుకోవడానికి హింస ఒక్కటే మార్గం కాదని, కౌన్సెలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
#HonourKilling
#KarimnagarCrime
#TelanganaPolice
#JusticeForDaughter
#CrimeNews
#BreakingNews