సంక్రాంతి బరిలో రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’
హీరో రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. (Ravi Teja Sankranti Movie)
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై భారీ బజ్‌ను సృష్టించాయి. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షల సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని మేకర్స్ చెబుతున్నారు. (Bharta Mahashayulaku Vignapthi Movie)
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం కిషోర్ తిరుమల వహించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విజయ్ కుమార్ చాగంటి వ్యవహరించారు. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. (Sankranti Telugu Movies 2026)
#RaviTeja
#BhartaMahashayulakuVignapthi
#SankrantiRelease
#TeluguCinema
#FamilyEntertainer