మూడు వేల అడుగులతో రక్తపోటు నియంత్రణ
రోజుకు సగటున (3000 Steps Per Day) మూడు వేల అడుగులు నడిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, అధిక రక్తపోటును తగ్గించవచ్చని తాజా (Blood Pressure Control) అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనను అయోవా స్టేట్ యూనివర్సిటీలోని డక్ చున్ లీ ల్యాబ్‌లో రక్తపోటు నిపుణుడు పెస్కాటెల్లోతో పాటు ఎలిజబెత్ లెఫెర్ట్స్ తదితర పరిశోధకులు నిర్వహించారు.
రక్తపోటుకు సంబంధించి చేసిన ఈ పరిశోధన (Cardiovascular Health Study) ‘జర్నల్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డెవలప్‌మెంట్ అండ్ డిసీజ్’లో ప్రచురితమైంది. వయస్సు పైబడిన వారిలో అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుండటంతో, రోజువారీ నడక సమయాన్ని పెంచడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా అనే కోణంలో ఈ అధ్యయనం చేపట్టారు.
ఈ అధ్యయనానికి ముందు రోజుకు సగటున నాలుగు వేల అడుగులు వేసే వృద్ధులపై పరిశోధన చేసినట్లు తెలిపారు. అయితే నాలుగు వేల అడుగులు నడవడం వల్ల ఎక్కువ శారీరక శ్రమ పడటంతో అలసటకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. అందుకే రక్తపోటు నియంత్రణకు రోజుకు మూడు వేల అడుగులు నడవడం సరైన లక్ష్యమని పరిశోధకులు నిర్ణయించారు.
కోవిడ్ మహమ్మారి సమయంలోనే ఈ అధ్యయనం నిర్వహించబడింది. ఇందులో పాల్గొన్న వృద్ధులకు పెడోమీటర్లు, రక్తపోటు మానిటర్లు, స్టెప్ డైరీలతో కూడిన కిట్లు అందజేశారు. మొత్తం 21 మందిలో ఎనిమిది మంది ఇప్పటికే రక్తపోటు మందులు వాడుతున్నారు. వీరు రోజువారీ వాకింగ్ సమయాన్ని కొద్దిగా పెంచడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని పరిశోధకులు గమనించారు.
మొత్తంగా రక్తపోటు నియంత్రణకు శారీరక శ్రమ, ముఖ్యంగా నడక కీలక పాత్ర పోషిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
#BloodPressure
#WalkingBenefits
#HeartHealth
#HealthyLifestyle
#FitnessResearch