‘ది రాజా సాబ్’ క్రిస్మస్ ట్రీట్
పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ పండుగ సందర్భంగా అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌ను అందించింది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం జనవరి 9న విడుదల కానుండగా, క్రిస్మస్ సందర్భంగా నిర్మాణ సంస్థ (People Media Factory) పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రాజే యువరాజే..’ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేసింది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందించారు.
హారర్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
#TheRajaSaab
#Prabhas
#PanIndiaMovie
#ChristmasTreat
#PeopleMediaFactory
#Thaman