ఫిబ్రవరి 13న థియేటర్లలోకి విశ్వక్సేన్ ‘ఫంకీ’
వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు (Vishwak Sen) విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో (Sithara Entertainments) సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు (KV Anudeep) కె.వి. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కయాదు లోహార్ కథానాయికగా నటించారు. విశ్వక్సేన్–అనుదీప్ కాంబినేషన్‌పై చిత్ర పరిశ్రమలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘ధీరే ధీరే’ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను సంజిత్ హెగ్డే, రోహిణి సోరట్ ఆలపించగా, దర్శకుడు కె.వి. అనుదీప్ సాహిత్యం అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ గీతం ప్రేమికులను ఆకట్టుకుంటోంది.
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
#FunkyMovie
#VishwakSen
#TeluguCinema
#ValentinesDayRelease
#SitharaEntertainments
#KVAnudeep