తినే ముందు ద్రాక్షను ఇలా కడగకపోతే ప్రమాదమే!
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా (Grapes) ద్రాక్ష విరివిగా లభిస్తున్నాయి. ఈ సీజన్లో నీటి శాతం ఎక్కువగా ఉండే ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ద్రాక్షను కొనగానే సరైన విధంగా శుభ్రం చేయకుండా నేరుగా తినేస్తుండటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా మామూలు నీటితో ద్రాక్షను కడిగి తినడం సురక్షితం కాదని (Nutritionists) న్యూట్రీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సాధారణ నీటితో కడిగితే ద్రాక్షపై ఉండే బ్యాక్టీరియా, పురుగుమందుల అవశేషాలు పూర్తిగా తొలగిపోవని వైద్యులు చెబుతున్నారు.
ద్రాక్షను తినే ముందు తప్పనిసరిగా సరైన విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ముందుగా వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపిన నీటిలో ద్రాక్షను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి. అనంతరం నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇలా చేయడం ద్వారా ద్రాక్షపై ఉండే హానికరమైన పదార్థాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
తర్వాత ద్రాక్షను టిష్యూ పేపర్ లేదా మెత్తటి వస్త్రంపై పరచి పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై గాలి చొరబడే ప్రదేశంలో ఉంచుకోవచ్చు. అవసరమైతే (Food Safety) ఆహార భద్రత దృష్ట్యా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే కొన్ని రోజులు తాజాగా ఉంటాయి. రుచిలో కూడా ఎలాంటి తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు.
సరైన విధంగా శుభ్రం చేసిన ద్రాక్షను తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
#HealthyEating
#FoodSafety
#WashFruits
#GrapesBenefits
#NutritionTips
#HealthyLifestyle