కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 11 మంది మంటల్లో సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా కాలిపోయింది.
బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలోని గోర్లట్లు వద్ద (Hiriyur, Chitradurga District) ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదానికి గురైంది.
లారీ డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డివైడర్‌ను దాటిన కంటెయినర్ లారీ (Container Lorry) ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. అందులో 11 మంది మృతి చెందగా, 21 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చిత్రదుర్గ పోలీసులు వెల్లడించారు.
ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
#KarnatakaAccident
#RoadAccident
#BusFire
#BreakingNews
#Chitradurga
#PublicSafety